: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరే ఉంటుంది: పార్లమెంటులో అరుణ్ జైట్లీ స్పష్టీకరణ


శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్, టీడీపీ సభ్యులు నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ ఇద్దరూ గౌరవ ప్రదమైన వ్యక్తులే అని చెప్పారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ టెర్మినల్ కు రాజీవ్ గాంధీ పేరే ఉంటుందని... డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ విషయంలో ఇకపై ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News