: సీబీఐ డైరెక్టర్ల నియామక సవరణ బిల్లుకు వైకాపా మద్దతు


పార్లమెంట్ ముందుకు వచ్చిన సీబీఐ డైరెక్టర్ల నియామక సవరణ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. సీబీఐ డైరెక్టర్ల నియామకానికి సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాలపై ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఐ పక్షపాత వైఖరితో వ్యవహరించేందుకు ప్రస్తుత మార్గదర్శకాలు ఊతమిస్తున్నాయన్న ఆయన, సీబీఐ ఆశ్రిత పక్షపాతాన్నే అవలంభిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుపై దర్యాప్తు జరపాలన్న ప్రభుత్వ వినతికి సిబ్బంది లేరన్న సీబీఐ, జగన్ పై విచారణకు మాత్రం ఆగమేఘాల మీద 22 బృందాలను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News