: 2000 థియేటర్లలో విడుదల కానున్న 'లింగ'
రజనీకాంత్ హీరోగా, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లింగ' చిత్రాన్ని డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నేడు మీడియాతో మాట్లాడుతూ, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికేట్ ఇచ్చిందని వివరించారు. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టిలు నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు.