: నవ్యాంధ్రను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దుతా: చంద్రబాబు


నవ్యాంధ్రప్రదేశ్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా మూడో రోజు శానోనో స్టార్మ్ రిజర్వాయర్ ను సందర్శించిన ఆయన అక్కడి వరద నివారణ చర్యలను పరిశీలించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 13 స్మార్ట్ సిటీల నిర్మాణంలో జపాన్ సాంకేతిక సహకారం అవసరమన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి కూడా ఆ దేశ సహకారం ఎంతో అవసరమన్నారు. జపాన్ పెట్టుబడులతో రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించే వీలుందన్నారు. అంతకుముందు తన ప్రతినిధి బృందంతో కలిసి పుకువోకాలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి వ్యర్థాల నిర్వహణ, వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్ ఏర్పాట్లు తదితరాలను పరిశీలించారు.

  • Loading...

More Telugu News