: కూలిన 30 విమానాలు... రూ.1000 కోట్లకు పైగా నష్టం


గడచిన మూడేళ్ళలో ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్ లు కూలిపోయాయని, దీనివల్ల పలువురు ఉద్యోగులు, ప్రజలు మరణించగా, దేశానికి రూ.1,161 కోట్ల నష్టం వాటిల్లిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు తెలిపారు. ఈ ప్రమాదాలన్నీ మానవ తప్పిదాలతో పాటు సాంకేతిక కారణాల వల్ల జరిగాయని ఆయన వివరించారు. 2011-12లో 13 ప్రమాదాలు, 2012-13లో 6, 2013-14లో 6, ఈ సంవత్సరం ఇప్పటివరకు 5 ప్రమాదాలు జరిగాయని తెలిపారు.

  • Loading...

More Telugu News