: గన్నవరం ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: రాపోలు
శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ఈ రోజు రాజ్యసభలో చెప్పారు. ఎయిర్ పోర్టు పేరును మార్చరాదని తెలంగాణ అసెంబ్లీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. ఎన్టీఆర్ పేరే కావాలనుకుంటే విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు పెట్టుకోవాలని అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలని కోరారు.