: ఈ ఏడాదే అత్యధిక సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు: కేంద్ర హోం శాఖ


దేశంలో లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య ఈ ఏడాదిలోనే అత్యధికమని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. అక్టోబర్ 31 నాటికి దేశంలో మొత్తం 472 మంది మావోయిస్టులు లొంగిపోయారని నేటి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆ శాఖ ప్రకటించింది. గతేడాది 283 మంది మావోలు లొంగిపోయారని, ఈ సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగిందని పేర్కొంది. ఇటీవలి కాలంలో 2014లోనే అధిక సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పట్టారని వెల్లడించింది. మావోల లొంగుబాటలో ఛత్తీస్ గఢ్ తొలి స్థానంలో నిలుస్తున్నప్పటికీ, అక్కడే మావో కార్యకలాపాలు ఎక్కువగా నమోదయ్యాయని కూడా పేర్కొంది. అంతేకాక ఈ ఏడాదిలోనే ఆ రాష్ట్ర పోలీసులు అత్యధిక సంఖ్యలో 387 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది అక్టోబర్ దాకా 76 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతేడాది మొత్తంలో ఈ సంఖ్య 82గా నమోదైంది.

  • Loading...

More Telugu News