: జెనీలియా, రితిష్ దంపతులకు అభినందనల వెల్లువ


మగబిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా, రితిష్ దంపతులను బాలీవుడ్ నటీనటులు, ప్రముఖులు, అభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. నిన్న జెనీలియా పండంటి బిడ్డను ప్రసవించిన సంగతి తెలిసిందే. ఈ వార్తను రితిష్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'వెల్ కం టు ది పేరెంట్స్ క్లబ్' అని అభిషేక్ బచ్చన్, 'కంగ్రాచ్యులేషన్స్' అంటూ కరణ్ జోహార్, 'నేను చెప్పినట్టుగానే అబ్బాయి పుట్టాడు. వేడుకలకు వస్తా' అని తుషార్ కపూర్ అభినందించారు. వీరితో పాటు దియా మిర్జా, అర్బాజ్ ఖాన్, అమృతా అరోరా, అర్పితా ఖాన్, ఫర్హాన్ అఖ్తర్, లారా దత్తా, బిపాషా బసు తదితరులెందరో జెనీలియా, రితిష్ దంపతులను అభినందించారు.

  • Loading...

More Telugu News