: వివాదాల పరిష్కారానికి నమ్మకం అనే బంధం కావాలి: నవాజ్ షరీఫ్
ఎలాంటి వివాదాలు లేని, సామరస్యపూర్వక దక్షిణాసియాను తాము కోరుకుంటున్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దేశాల మధ్య వివాదాలు పరిష్కారం కావాలంటే, నమ్మకం అనే బంధం కావాలని చెప్పారు. ఖాట్మండూలో జరుగుతున్న 18వ సార్క్ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సార్క్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సదస్సులో ఉమ్మడి అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.