: అప్పుడొద్దన్నారుగా... విమర్శలెందుకు?: జగన్ వ్యాఖ్యలపై దేవినేని మండిపాటు
రాజధానికి భారీ మొత్తంలో భూములెందుకన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఎన్నికలప్పుడేమో రుణమాఫీ వద్దన్న జగన్ కు ప్రస్తుతం తాము అమలుచేస్తున్న రుణమాఫీపై విమర్శలు చేసే అర్హత లేదని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు లోటు బడ్జెట్ లో ఉండి కూడా రైతులకు రుణ మాఫీ చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిపోయి విమర్శలు గుప్పించడం జగన్ కు తగదన్నారు. జగన్ దోపిడీపై ఆయన పార్టీ నేతలు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఉమ డిమాండ్ చేశారు.