: దాసరికి సమన్లు జారీ చేసిన ఈడీ
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. బొగ్గు కుంభకోణం విచారణలో భాగంగా దాసరికి సమన్లు జారీ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న బొగ్గు కుంభకోణంలో పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంలో దాసరి నారాయణరావు బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.