: మేఘాలయ 'మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్' తమిళనాడులో అరెస్టు
మేఘాలయ 'అచిక్ నేషనల్ కోఆపరేటివ్ ఆర్మీ' (ఏఎన్ సీఏ)కి చెందిన 'మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్' విలియం ఎ సంగ్మాను పోలీసులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు సహాయకుడిని కూడా ప్రత్యేక టీమ్ సహాయంతో తిరుపూర్ జిల్లాలోని ఓ రెడీమేడ్ వస్త్ర తయారీ కర్మాగారంలో అరెస్టు చేసినట్టు పోలీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మూడు నెలల కిందట అంటే ఆగస్టులో మెండిపాథర్ జైలు నుంచి తప్పించుకుపోయారని, వారిపై ఓ హత్య కేసు ఉందని వివరించారు.