: అమరవీరులను సమరయోధులుగా గుర్తించండి: జీవన్ రెడ్డి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారిని తెలంగాణ సమరయోధులుగా ప్రకటించాలని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా అమరుల త్యాగాలపై మాట్లాడిన జీవన్ రెడ్డి, భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన అలనాటి యోధులను స్వాతంత్య్ర సమరయోధులుగా భారత ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రాణత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పునాదులు వేసిన అమరవీరులను కూడా తెలంగాణ సమరయోధులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక నల్లగొండ జిల్లాకు ఉద్యమంలో ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి పేరు పెట్టాలని కోరారు. జీవన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.