: టీఎస్ దేవాదాయ శాఖకు టీటీడీ నుంచి రూ. 241 కోట్లు రావాలి: హరీష్
ఈ రోజు తెలంగాణ శాసనసభలో టీఎస్ మంత్రి హరీష్ రావు కొత్త వాదాన్ని లేవనెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నుంచి తెలంగాణకు రూ. 241 కోట్లు రావాలని తెలిపారు. దేవాదాయ శాఖకు టీటీడీ బకాయి పడి ఉందని... విభజన చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన తెలంగాణకు డబ్బు పంచాలని చెప్పారు. దీని కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో... దేవాదాయశాఖకు నిధుల మంజూరు అంశంపై చర్చ సందర్భంగా హరీష్ సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.