: బాబా రాంపాల్ నా బర్రెల ఆస్తి: ఆజంఖాన్
యూపీ మంత్రి, ఎస్పీ నేత ఆజంఖాన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో ఇటీవల అరెస్టైన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త బాబా రాంపాల్ ప్రతి రోజు తన బర్రె పాలతో స్నానం చేసేవాడని చెప్పారు. "ఆయన శిష్యులు ప్రతి రోజు నా బర్రెల పాలను తీసుకెళ్లి ఆయనకు స్నానం చేయించేవారు. అంతేకాక, ఆ పాలతోనే పాయసం చేసి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవారు. రాంపాల్ కు ఇంతటి ప్రాచుర్యం లభించడానికి నా బర్రె పాలే కారణం. నా బర్రె పాలతోనే రాంపాల్ కు భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి" అని చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే బాబా రాంపాల్ తన బర్రెల ఆస్తి అని ఆజంఖాన్ వెల్లడించారు.