: ‘కేబీఆర్’ ఓబులేష్... ఏకే 47 వాడకంలో నిష్ణాతుడు!
కేబీఆర్ కాల్పుల ఘటన నిందితుడు ఓబులేష్, ఏకే 47ను వినియోగించడంలో నిష్ణాతుడట. కాల్పుల ఘటనలో ఓబులేష్ ను విచారిస్తున్న బంజారా హిల్స్ పోలీసులు పలు ఆసక్తికర అంశాలను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా ఏకే 47 వినియోగించడంలో ఎక్స్ పర్ట్ గా పేరుగాంచిన ఓబులేష్, ఉన్నతాధికారుల నుంచి పలు అవార్డులు, రివార్డులు అందుకున్న వైనం బయటికొచ్చింది. ఉన్నతాధికారుల ప్రశంసలకైతే కొదవే లేదట. ఇక మావోయిస్టులపై పోరు సాగించేందుకు ఏపీ సర్కారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ లో ఓబులేష్ చోటు సాధించాడు. అంతేకాక మావోలపై గ్రేహౌండ్స్ జరిపిన పలు ఆపరేషన్లలోనూ ఓబులేష్ పాలుపంచుకున్నాడు. ఆపరేషన్లలో చురుకుగా వ్యవహరించే ఓబులేష్ ను ఉన్నతాధికారులే కాక సహోద్యోగులు కూడా మెచ్చుకునేవారట.