: మెదక్ లో కల్తీ పాల కలకలం... పలువురికి అస్వస్థత


తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో బుధవారం కల్తీ పాల వ్యవహారం కలకలం రేపింది. కృత్రిమ రసాయనాలను నీళ్లలో కలిపి గేదె పాలుగా ప్రచారం చేస్తూ మల్లేశం అనే వ్యక్తి వారం రోజులుగా విక్రయిస్తున్నాడు. ఈ కల్తీ పాలను తాగిన వారు క్రమంగా అనారోగ్యానికి గురయ్యారు. అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం పాల వ్యాపారిని వినియోగదారులు నిలదీయగా అసలు విషయం వెలుగు చూసింది. గోబిందా పేస్టును నీళ్లలో కలిపి, స్వచ్ఛమైన పాలుగా ప్రచారం చేసిన మల్లేశం కల్తీ పాలను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాడు. పాలల్లో నీళ్ల శాతం తక్కువగా ఉన్నట్లు కనిపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ఆ పాలను కొనుగోలు చేశారు. అయితే గోబిందా పేస్టుతో తయారు చేస్తున్న పాలు తాగిన వారు అస్వస్థతకు గురయ్యారు. అసలు విషయం బయటపడటంతో వినియోగదారులు కల్తీ పాల వ్యాపారి మల్లేశంను పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉంటే, గోబిందా పేస్టుతో కల్తీ పాలనే కాక కల్తీ కల్లును కూడా తయారు చేసి విక్రయిస్తున్నట్లు మల్లేశం అంగీకరించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News