: సొంత బాబాయ్ చేతిలో చిన్నారి ఆరాధ్య హత్య!
ఒంగోలులో కిడ్నాప్ కు గురైన చిన్నారి ఆరాధ్య తన సొంత బాబాయ్ చేతిలోనే అత్యంత దారుణంగా హత్యకు గురైంది. పసిపాపను మంగళవారం అపహరించిన పాప బాబాయ్ లక్ష్మీనారాయణ పాశవికంగా హతమార్చి మృతదేహాన్ని పొలాల్లో పడేశాడు. అంతేకాక పసిపాప మృతదేహాన్ని గుర్తుపట్టకూడదన్న భావనతో హత్య చేసిన తర్వాత చిన్నారి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. పసిపాప కిడ్నాప్ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరాధ్య మృతదేహాన్ని సర్వారెడ్డిపాలెం సమీపంలో కనుగొన్నారు. ముద్దులొలికే చిన్నారి ఆరాధ్యను పాప అమ్మమ్మ అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వైనాన్ని జీర్ణించుకోలేకనే లక్ష్మీనారాయణ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.