: ఏపీ టీచర్ పోస్టుల్లో స్థానికేతరులపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఉద్యోగాల విషయంలో 15 శాతం పోస్టుల కోసం స్థానికేతరులు (ఓపెన్ కేటగిరీ కింద) పోటీ పడే అవకాశం ఉంది. దీంతో, ఓపెన్ కేటగిరీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించేందుకు ఉన్నతాధికారులతో ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు భేటీ కానున్నారు. ఈ క్రమంలో, ఓపెన్ కేటగిరీపై నేడు స్పష్టత వచ్చే అవకాశం కనపడుతోంది.