: ఎన్టీఆర్ పేరుపై నేడు టీ కాంగ్రెస్ నేతల నిరసన
శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిరసనకు దిగనున్నారు. ఎన్టీఆర్ పేరుపై మంగళవారం నాటి రాజ్యసభ సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వి.హనుమంతరావు సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్లకార్డులు చేతబట్టి సభలో నిరసన తెలిపారు. బుధవారం నాటి సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో ఈ అంశంపై చర్చించేందుకు అవకాశమివ్వాలని వారు రాజ్యసభ ఉపాధ్యక్షుడికి నోటీసు ఇచ్చారు. అంతేకాక పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు కూడా ఆ పార్టీ ఎంపీలు రెడీ అవుతున్నారు.