: మోతీ నగర్ లో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు!


హైదరాబాదులోని మోతీ నగర్ లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. మోతీ నగర్ లోని ఓ అపార్ట్ మెంటుపై దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున సాగుతున్న వ్యభిచారాన్ని కనుగొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద సంఖ్యలో మహిళలు, విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో జూనియర్ ఆర్టిస్ట్ స్వాతి కూడా ఉన్నట్లు సమాచారం. వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ నిందితులను పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వ్యభిచారం సమాచారాన్ని పోలీసులకు చేరవేసిన స్థానికులు, వ్యభిచార నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News