: కొత్త రాష్ట్రం... పెట్టుబడులకు స్వర్గధామం: జపాన్ ప్రతినిధులతో చంద్రబాబు
కొత్త రూపు సంతరించుకోనున్న ఆంధ్రప్రదేశ్... పెట్టుబడులకు స్వర్గధామమేనని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశ రాజధాని టోక్యో సహా క్యోటో నగరాల్లో పర్యటించిన బాబు బృందం అక్కడి పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో భేటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీలోని అపార అవకాశాలను వారికి వివరించిన సందర్భంగా సీఎం ఈ మేరకు వ్యాఖ్యానించారు. పెట్టుబడులతో ఏపీకి వచ్చే విదేశీ పారిశ్రామిక వేత్తలకు మార్కెట్లను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. కంపెనీల స్థాపనకు సంబంధించి అన్ని రకాల అనుమతులను ఒకే చోట ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. జపాన్ నగరాల తరహాలో కొత్త రాష్ట్రంలోనూ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.