: డీఎస్పీ కార్యాలయం స్థాయికి తుళ్లూరు పోలీస్ స్టేషన్ అప్ గ్రేడ్?


నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకోనున్న తుళ్లూరుకు మహార్దశ ప్రారంభమైంది. కొత్త రాజధాని ఏర్పాటు కోసం ఎంపికైన ఈ ప్రాంతానికి ఇప్పటికే పలువురు రియల్టర్లు, అధికారుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో నిత్యం ఖరీదైన కార్లతో తుళ్లూరు కళకళలాడుతోంది. భూములకు సంబంధించిన క్రయవిక్రయాలు కూడా ఊపందుకున్నాయి. అందుకనుగుణంగా ఏర్పాట్లు కూడా వేగంగానే అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ హోదాను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రస్తుతం తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఎస్సై స్థాయి అధికారి వ్యవహరిస్తున్నారు. ఈ అధికారి స్థాయిని డీఎస్పీ కేడర్ కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను అందజేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సునీల్ కుమార్ కు డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రాజధానిగా ఆవిర్భవించనున్న ప్రాంతంలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే కష్టమన్న భావనతోనే ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోంది. త్వరలోనే తుళ్లూరు పోలీస్ స్టేషన్ హోదా పెంచుతూ ఉత్తర్వులు వెలువడనున్నాయి.

  • Loading...

More Telugu News