: నిర్ణీత గడువులోగా క్లియరెన్స్ ... లేదంటే అనుమతి వచ్చేసినట్లే!: టీ పాస్ బిల్లు


తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం మంగళవారం శాసనసభ ముందుకు వచ్చింది. ఈ బిల్లులో తెలంగాణ ప్రభుత్వం పలు సంచలనాత్మక నిర్ణయాలు పొందుపరిచింది. పరిశ్రమల స్థాపనలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని తీర్మానించిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం నుంచి జరిగే జాప్యాన్ని నివారించేందుకు కూడా కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేసింది. పరిశ్రమ స్థాయిని బట్టి నిర్ణీత గడువులోగా అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, ఆ నిర్ణీత గడువులోగా అనుమతులు రాకపోతే, సదరు దరఖాస్తులకు అనుమతులు వచ్చేసినట్లేనని వెల్లడించింది. అంటే, 15 రోజుల్లోగా అనుమతులు రావాల్సిన దరఖాస్తు విషయంలో అధికారులు జాప్యం చేస్తే, 16వ రోజున ఆ దరఖాస్తుకు ప్రభుత్వ అనుమతి వచ్చేసినట్లుగానే పరిగణిస్తారు. గతంలో ఈ తరహా నిబంధన ఎక్కడా, ఎప్పుడు కూడా అమలు కాలేదనే చెప్పాలి.

  • Loading...

More Telugu News