: దిలీప్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నారు...పుకార్లు కట్టిపెట్టండి: బిగ్ బీ
ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నట్టు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. దిలీప్ కుమార్ ఆరోగ్యానికి సంబంధించి సామాజిక నెట్ వర్క్ లలో జరుగుతున్న ప్రచారం తప్పని ఆయన ఖండించారు. 91 ఏళ్ల దిలీప్ కుమార్ ఆరోగ్యం క్షీణించిందంటూ సామాజిక వెబ్ సైట్లలో పుకార్లు వ్యాపించాయి. యూసఫ్ (దిలీప్ కుమార్ అసలు పేరు) సాబ్ గురించి నిరాధారమైన పుకార్లు వ్యాపించాయని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు బిగ్ బీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దిలీప్ కుమార్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు సైరా జీ తనకు తెలిపినట్లు ట్విట్ చేశారు. దిలీప్ కుమార్ తన భార్య సైరాభానుతో కలసి ఇటీవల ముంబైలో జరిగిన సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు.