: జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ జంటకి పుత్రోత్సాహం
ప్రముఖ నటి జెనీలియా డిసౌజా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి 2012లో పెళ్లాడింది. పెళ్లి తరువాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సీసీఎల్ జట్టును కొనుగోలు చేసి సినిమా రంగానికి దగ్గరగానే కొనసాగుతోంది. రెండేళ్ల వీరి ప్రేమకు గుర్తుగా బాబు పుట్టాడని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపిన రితేష్ దేశ్ ముఖ్, తమ కుటుంబంలోకి మూడో వ్యక్తి వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నాడు.