: 'రాజధాని' బాధ్యతలు నెల్లూరు జిల్లా కలెక్టర్ కు అప్పగింత
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ కు ఏపీ సర్కారు కీలక బాధ్యతలు అప్పగించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రత్యేక కమిషనర్ గా శ్రీకాంత్ ను నియమించింది. ఈ నేపథ్యంలో, గ్రేటర్ విశాఖ అదనపు కమిషనర్ ఎం.జానకిని నెల్లూరు కలెక్టర్ గా నియమించారు. ప్రస్తుతం రాజధాని భూసమీకరణ యత్నాలు ముమ్మరమైన తరుణంలో, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకే ఈ నియామకం చేసినట్టు తెలుస్తోంది.