: ఐపీఎల్ ఫిక్సింగ్ పై సుప్రీంలో విచారణ వాయిదా
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాంపై ముద్గల్ కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో, సుప్రీం కోర్టులో నేడు విచారణ వాయిదాపడింది. కాగా, విచారణ సందర్భంగా, నివేదికలో పేర్కొన్న ఆటగాళ్ల పేర్లు సహా రిపోర్టులో ఉన్నది అంతా బహిర్గతం చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. అంతేగాక, ఐసీసీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్ ను సెక్షన్ 6 కింద రెండేళ్ల నుంచి ఆరు సంవత్సరాల వరకు భారతీయ క్రికెట్ నుంచి దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సుప్రీం "కమిటీ నివేదికలో ఉన్నది బయటపెట్టడం ద్వారా మీకు ప్రయోజనం కలగొచ్చు లేదా నష్టం వాటిల్లవచ్చు. అయితే, ఆటలో గెలుపోటముల కంటే సమాచారాన్ని బయటపెట్టడం క్షమించరాని నేరం" అని అన్నట్టు మీడియా సమాచారం. కాగా, శ్రీని, చెన్నైసూపర్ కింగ్స్ లపై కోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో కమిటీ నివేదికపై విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది.