: ఏపీలో ఎర్రచందనం వేలానికి భారీ స్పందన


ఆంధ్రప్రదేశ్ లో ఎర్రచందనం వేలానికి తొలిరోజు భారీ స్పందన లభించిందని రాష్ట్ర అటవీ శాఖ అధికారి తెలిపారు. మంగళవారం మొత్తం 862 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని వేలం వేసినట్లు చెప్పారు. తద్వారా ప్రభుత్వానికి రూ.261 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. అంతర్జాతీయ కంపెనీలు అధిక సంఖ్యలో వేలంలో పాల్గొన్నాయని వివరించింది. ఏ-గ్రేడ్ ఎర్రచందనం మెట్రిక్ టన్నుకు రూ.1.95 లక్షల ధర, బి-గ్రేడ్ ఎర్రచందనం మెట్రిక్ టన్నుకు రూ.56 లక్షల నుంచి రూ.1.55 లక్షలు, సీ-గ్రేడ్ ఎర్రచందనం మెట్రిక్ టన్నుకు రూ.37 లక్షలు పలికిందని అటవీ శాఖ అధికారి వెల్లడించారు. డిసెంబర్ 1 వరకు వేలం జరుగుతుందని, వేలాన్ని అడ్డుకునేందుకు చాలామంది ప్రయత్నించారని వివరించారు.

  • Loading...

More Telugu News