: ఖాట్మండూలో ట్రామాకేర్ సెంటర్ ప్రారంభించిన మోదీ
సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు నేపాల్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ, ఖాట్మండూలో ట్రామాకేర్ సెంటర్ (ప్రమాదాలలో గాయపడిన వారికి చికిత్స చేసే ఆసుపత్రి)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు ఇది చిహ్నమని అభివర్ణించారు. ఈ ట్రామా కేంద్రం నిర్వహణలో నేపాల్ కు సహకరిస్తామని చెప్పారు. వాస్తవానికి నేపాల్ లో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలనుకున్నానని, అయితే, సమయాభావం వల్ల వీలుకావడంలేదని అన్నారు. కాగా, మోదీ కొద్దిసేపటి క్రితం నేపాల్ ప్రధాని కార్యాలయానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.