: మా ఫ్యాక్టరీని సందర్శించండి... కేసీఆర్‌కు ఎల్‌ అండ్ టీ ఆహ్వానం


సూరత్‌ సమీపంలోని హజీరాలో ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఉన్న తమ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎల్అండ్ టీ కోరింది. ఈ మేరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏ.ఎమ్.నాయక్ కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. రాష్ట్ర సమగ్రాభివృద్దికి కేసీఆర్ స్పష్టమైన విజన్‌తో పనిచేస్తున్నారని, రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములమయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏ.ఎమ్.నాయక్ తన లేఖలో పేర్నొన్నారు. విద్యుత్, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News