: 152 సార్లు పాకిస్థాన్ గీతదాటింది: కేంద్రం


దేశ సరిహద్దుల్లో పాక్ దురాగతాలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వాస్తవాలు వివరించింది. ఎన్డీయే అధికారం చేపట్టిన తరువాత, ఇప్పటి వరకు పాకిస్థాన్ సేనలు 152 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. సరిహద్దుల వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో గత అక్టోబర్ వరకు 15 మంది మృతి చెందగా, 116 మంది గాయాలపాలయ్యారని కేంద్రం పార్లమెంటుకు వివరించింది. పలుమార్లు గీత దాటుతూనే పాక్ అంతర్జాతీయ సమాజం ముందు మొసలికన్నీరు కారుస్తోందని పార్లమెంటుకు కేంద్రం వెల్లడించింది.

  • Loading...

More Telugu News