: మెట్రో రైలు ప్రాజెక్టుపై ముగిసిన కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలకు విఘాతం కలగకుండా మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రభుత్వ ఉద్దేశమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మెట్రో రైలు ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుపై అధికారులతో సమీక్షించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం పవిత్రతను కాపాడేందుకు, అసెంబ్లీ వెనుక భాగం నుండి మెట్రో రైలు రూట్ ను మార్చాలని ఈ సందర్భంగా అయన మరోసారి ఎల్అండ్ టి అధికారులను కోరారు. సుల్తాన్ బజార్ దగ్గర కూడా ముందు అనుకున్న రూట్ ను మార్చాలని, ఉమెన్స్ కాలేజీ వెనుక నుంచి ఇమ్లిబన్‌కు చేరేలా కొత్త రూట్ ఉండాలని సూచించారు. పాతబస్తీలో మత సంబంధ నిర్మాణాలు దెబ్బతినకుండా పనులు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.