: సీఎం కావాలనుకున్నా: ప్రకాశం జిల్లాలో జగన్
ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మేలు చేయాలన్న ఆకాంక్షతో తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నానని తెలిపారు. సీఎం అయితే ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టే వీలుంటుందని అన్నారు. చంద్రబాబు ఇచ్చినట్టుగా తాము కూడా రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే తప్పక గెలిచి ఉండేవారమని జగన్ అభిప్రాయపడ్డారు. బాబు మాటలు విని రైతులు మోసపోయారని పేర్కొన్నారు. సీఎం కావాలన్న కోరికతో బాబు అడ్డమైన అబద్ధాలు చెప్పాడని ఆరోపించారు. టీడీపీ అరాచకాలను ఎదిరిద్దామని జగన్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు.