: మరణదండన ఉండాల్సిందే.. ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు
మరణదండనను తాత్కాలికంగా రద్దు చేయాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీసుకువచ్చిన ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఇది దేశ సార్వభౌమత్వ హక్కును హరించి వేస్తుందని, అమలులో ఉన్న చట్టాల ప్రకారం నేరస్తులకు శిక్షలు వేయలేమని ఐరాసలో భారత ప్రతినిధి మయాంక్ జోషి వ్యాఖ్యానించారు. భారత చట్టాలకు ఈ తీర్మానం వ్యతిరేకం అని ఆయన వివరించారు. కాగా, ఈ తీర్మానానికి అనుకూలంగా 114 దేశాలు ఓటు వేశాయి. 36 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా 34 దేశాలు ఓటింగుకు గైర్హాజరయ్యాయి.