: రసీదు అడిగితే రాడ్డుతో దాడి చేశాడు!
సెల్ బిల్లు కట్టేందుకు వెళ్లిన వినియోగదారుడిపై రాడ్డుతో డీలర్ దాడి చేసిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఒప్పిచర్లకు చెందిన తోట సిద్ధయ్య తన సెల్ ఫోన్ బిల్లు కట్టేందుకు నరసరావుపేట వచ్చాడు. డీలర్ కు బిల్లు చెల్లించి రసీదు కావాలని అడిగాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. దీంతో డీలర్ మంగపతిరెడ్డి పక్కనే ఉన్న రాడ్డు తీసుకుని సిద్ధయ్య తలపై కొట్టాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డీలర్ మంగపతిరెడ్డి స్థానిక వైఎస్సార్సీపీ నేత అని తెలుస్తోంది.