: అత్యధిక కనెక్టివిటీ ఉన్న దేశం డెన్మార్క్


కనెక్టివిటీ అంశంలో డెన్మార్క్ తాజాగా దక్షిణకొరియాను వెనక్కినెట్టింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక కనెక్టివిటీ ఉన్న దేశం డెన్మార్కేనట. సెల్ ఫోన్ వినియోగం, ఇంటర్ నెట్ వాడుక ఈ యూరోపియన్ దేశంలోనే అధికమని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అధ్యయనం చెబుతోంది. ఈ మేరకు ఓ జాబితా విడుదల చేశారు. రెండోస్థానంలో దక్షిణకొరియా ఉంది. ఆ తర్వాత వరుసగా స్వీడన్, ఐస్ లాండ్, బ్రిటన్ ఉన్నాయి. ఆసియాలో అగ్రస్థానం హాంకాంగ్ కు దక్కింది. హాంకాంగ్ ఓవరాల్ గా 9వ స్థానంలో ఉంది. అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 14వ స్థానంలో ఉంది. ఇక, ఈ జాబితాలో చివరి స్థానం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కు దక్కింది.

  • Loading...

More Telugu News