: రాజస్తాన్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ!


రాజస్తాన్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. మొత్తం 6 మునిసిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగ్గా ఆరింటినీ కైవసం చేసుకునే దిశగా బీజేపీ ముందుకెళుతోంది. అన్నిచోట్లా కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ అభ్యర్థులు అధిక స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి 91 వార్డులున్న జైపూర్ లో 45 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. జోథ్ పూర్ లో 20 వార్డుల్లో, ఉదయపూర్ లో 30 వార్డుల్లో, బికనేర్ లో 25 వార్డుల్లో, భారత్ పూర్ లో 18 వార్డుల్లో, కోటాలో 40 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. 18 మునిసిపల్ కౌన్సిల్ లు, 22 మున్సిపాలిటీలలో ఫలితాల ట్రెండ్స్ వెలువడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News