భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ చేరుకున్నారు. రేపట్నుంచి రెండు రోజుల పాటు జరిగే 18వ సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నేపాల్ వెళ్లారు.