: ఆంధ్రా విశేషాలున్న మహాత్ముడి డైరీ ప్రచురణ


జాతిపిత మహాత్మా గాంధీ వాడిన వస్తువులు ఇప్పుడు ఎంతో విలువైనవిగా పరిగణిస్తున్నారు. తాజాగా, ఆయన వ్యక్తిగత డైరీకి సబర్మతి ఆశ్రమం వారు పుస్తకరూపం కల్పించారు. ఆ పుస్తకాన్ని నవజీవన్ ట్రస్టు ముద్రించింది. ఆ పుస్తకానికి 'రోజ్ నిషి' (డైరీ) అని పేరు పెట్టారు. గాంధీ 1929లో ఆంధ్రాలో పర్యటించారు. ఆ విశేషాలను ఆయన తన డైరీలో పేర్కొన్నారు. ఇప్పుడదే ప్రచురణకు వచ్చింది. ఈ పుస్తకం ద్వారా ఆనాటి ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు తెలిసే అవకాశం ఉంది. కాగా, 'రోజ్ నిషి' పుస్తకంలోనే కుసుమ్ దేశాయ్ అనే గాంధీ సహాయకురాలి డైరీని కూడా పొందుపరిచారు. కుసుమ్ అప్పటికి వితంతువు. ఆమె ఆంధ్రా పర్యటనలో గాంధీకి సహాయకురాలిగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News