: హాకీ కోచ్ గా మళ్లీ వస్తా... క్రీడా మంత్రికి టెర్రీ వాల్ష్ లేఖ
హాకీ కోచ్ గా తిరిగి వచ్చేందుకు సుముఖంగా ఉన్నానని టెర్రీ వాల్ష్ తెలిపాడు. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ కు ఈ మాజీ కోచ్ లేఖ రాశాడు. "పురుషుల హాకీ కోచ్ గా తక్షణమే తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. అంతేగాక నాపై వచ్చిన ఆరోపణలు తప్పని బహిరంగంగా నిరూపించేందుకు సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) తో చర్చించడానికి కూడా రెడీగా ఉన్నాను" అని వాల్ష్ తెలిపాడు. వాల్ష్ కోచ్ గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్నది హాకీ ఇండియా అధ్యక్షుడు నరిందర్ బాత్రా ఆరోపణ. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను ఆస్ట్రేలియాకు చెందిన వాల్ష్ వాస్తవం కాదని రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు.