: అమీర్ ఖాన్... రియల్ హీరో: ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ప్రశంస


బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కు బాలీవుడ్ నుంచే కాక హాలీవుడ్ నుంచీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ మన మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ను రియల్ హీరోగా అభివర్ణించాడు. అంతేకాదు, బాక్సాఫీసును కొల్లగొట్టడంతో పాటు అవార్డులను ఎగరేసుకెళ్లడంలో అమీర్ తనకు తానే సాటి అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల భారత్ వచ్చిన ఆర్నాల్డ్, అమీర్ ను కలిశాడు. ఈ సందర్భంగా వారిద్దరూ కెమెరాలకు పోజులిచ్చారు. అనంతరం ఆర్నాల్డ్, అమీర్ గొప్పదనాన్ని కీర్తిస్తూ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News