: రాహుల్ ను తెగడిన నేతను క్షమించేసిన కాంగ్రెస్!


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని జోకర్ గా అభివర్ణించిన ఆ పార్టీ సీనియర్ నేత ముస్తఫాను అధిష్ఠానం క్షమించింది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఆయనను బహిష్కరించాలని కేరళ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముస్తఫా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన అధిష్ఠానం ఆదేశాల మేరకు కేరళ కాంగ్రెస్ ముస్తఫాపై బహిష్కరణ వేటేసింది. అయితే తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, తనను క్షమించమని ముస్తఫా ఇటీవల పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు. దీంతో శాంతించిన అధిష్ఠానం ఆదేశాల మేరకు ముస్తఫాపై ఉన్న బహిష్కరణను తొలగిస్తున్నట్లు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వీఎం సుధీరన్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News