: సానియా, సైనాలకు లోక్ సభ అభినందనలు
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ లకు లోక్ సభ అభినందనలు తెలిపింది. నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, మామ్ ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను కూడా అభినందించింది. తమ తమ రంగాల్లో వీరంతా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటారని ఈ సందర్భంగా లోక్ సభ తెలిపింది.