: మీరు చర్చ కోసం రాలేదు... గొడవ చేసేందుకే వచ్చారు: విపక్షాలపై స్పీకర్ ఆగ్రహం


లోక్ సభలో విపక్షాల తీరుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి సమావేశాల్లో భాగంగా నల్లధనంపై చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చకు అనుమతిస్తామని స్పీకర్ చేసిన ప్రకటనను విపక్షాలు తిరస్కరించి సభ వాయిదాకు కారణమయ్యాయి. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు తమ మొండిపట్టుదలను వీడలేదు. ఈ క్రమంలో నల్లధనంపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. అయినా సభ్యులు వినిపించుకోకుండా స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్, ‘మీరు చర్చ కోసం రాలేదు... గొడవ చేసేందుకే వచ్చారు’ అంటూ వారి తీరును తప్పుబట్టారు. అయినా సభ్యులు వినిపించుకోకపోవడంతో అదే మాటను ఆమె పలుమార్లు ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News