: నల్లధనంపై చర్చకు సిద్ధంగానే ఉన్నాం: వెంకయ్యనాయుడు


నల్లధనంపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈరోజు లోక్ సభలో నల్లధనంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాల కారణంగా లోక్ సభ వాయిదా పడింది. అరగంట తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు మరోమారు ఆందోళనకు దిగాయి. దీంతో స్పందించిన వెంకయ్యనాయుడు విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అంతేకాక, చర్చ ఎక్కడ జరిగినా, స్పీకర్ ఎప్పుడు అనుమతిచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, నల్లధనంపై చర్చకు వెనుకాడే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News