: క్రోమ్ బుక్ యూజర్లకు గూగుల్ బొనాంజా


క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే క్రోమ్ బుక్ ల్యాప్ టాప్ యూజర్లకు గూగుల్ బొనాంజా ప్రకటించింది. క్రోమ్ బుక్ యూజర్లు 1 టెరాబైట్ క్లౌడ్ స్టోరేజిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చని గూగుల్ తెలిపింది. లక్ష ఫొటోలను ఈ స్పేస్ లో సురక్షితంగా భద్రపరుచుకునే వీలుంటుంది. 1 టీబీ క్లౌడ్ స్టోరేజి మార్కెట్ విలువ రూ. 14 వేలు పైచిలుకే. ఈ ఉచిత సదుపాయం ద్వారా క్రోమ్ బుక్ ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ వోగెన్ థాలెర్ తెలిపారు. అటు, గూగుల్ ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ తన ఆఫీస్ 365 యూజర్లకు అన్ లిమిటెడ్ వన్ డ్రైవ్ స్టోరేజి సదుపాయం కల్పించనుంది.

  • Loading...

More Telugu News