: ఇంకాస్త తగ్గనున్న పెట్రోల్ ధర!


దేశంలో పెట్రోల్, డీజిల్ ధర మరికాస్త తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఉత్పత్తి చేస్తున్న క్రూడాయిల్ పరిమాణాన్ని తగ్గించేందుకు ఒపెక్ అంగీకరించేలా లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో బ్యారల్ క్రూడాయిల్ ధర మరింత తగ్గింది. నేటి సెషన్ లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్ కు 9 సెంట్లు తగ్గి 79.59 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ధర మరింతగా తగ్గవచ్చని నిపుణుల అంచనా. గత వారం రోజులుగా క్రూడాయిల్ ధర తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఇండియాలో సైతం ధరల సవరణ జరగనుంది. భారత చమురు కంపెనీలు ఈ వారం చివరలో పెట్రోల్ తగ్గింపు విషయంలో ఒక ప్రకటన చేసే అవకాశం వుంది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇప్పటివరకు 7 సార్లు పెట్రోల్ ధర తగ్గిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News