: హెచ్ సీయూ వీసీ రాజీనామా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ రామస్వామి రాజీనామా చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇంకా పద్దెనిమిది నెలల పదవీకాలం ఉండగానే రామస్వామి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేశానని ఆయన చెబుతున్నప్పటికీ... యూనివర్శిటీలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలోనే ఆయనీ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. తన రాజీనామాను కేంద్రం ఆమోదించే వరకు రామస్వామి లీవులో ఉంటారని చెబుతున్నారు.