: 30 సెకన్లలోనే మొబైల్ ఛార్జింగ్!


ఇజ్రాయెల్ కు చెందిన స్టోర్ డాట్ సంస్థ ఓ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. తద్వారా 30 సెకన్లలో ఓ స్మార్ట్ ఫోన్ (ఒక రోజుకు సరిపడ శక్తి)ను, కొన్ని నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కారును చార్జింగ్ చేయవచ్చట. ఈ సంస్థ వేగవంతమైన చార్జింగ్ కు అనుకూలమైన హైబ్రిడ్ బ్యాటరీ రూపొందించింది. క్షణాల్లోనే శక్తిని నిక్షిప్తం చేసుకోగల సామర్థ్యం ఈ బ్యాటరీ సొంతమని స్టోర్ డాట్ తెలిపింది. అత్యధిక సాంద్రత కలిగిన స్పాంజి తరహాలో ఈ బ్యాటరీ వ్యవహరిస్తుందని, శక్తిని ఇముడ్చుకుంటుందని వెల్లడించింది. ఇది 2016లో మొబైల్ ఫోన్లకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News